Radhika Apte
Radhika Apte| ఆకేరు న్యూస్, డెస్క్: నటి రాధికా ఆప్టే తన వ్యక్తిగత విషయాలను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేందుకు ఏమాత్రం వెనుకాడరు. తాజాగా 41వ ఏట అడుగుపెట్టిన ఆమె.. ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 3’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో 40ల్లో ఉన్న ఓ మహిళ దృష్టికోణంలో లైంగికత, మహిళల కోరికలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాధికా ఆప్టే తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.
వయసు పెరగడం క్షీణత కాదు
40ల్లోకి వచ్చిన తర్వాత తన గురించి, తన శరీరం గురించి మరింత లోతుగా తెలుసుకుంటున్నానని రాధికా ఆప్టే తెలిపారు. సమాజంలో వయసు పెరగడాన్ని చాలాసార్లు క్షీణతగా చూస్తారని, అయితే తన అనుభవం అందుకు భిన్నంగా ఉందన్నారు. “నాకు ఇప్పుడు 41 ఏళ్లు. నా 20, 30 ఏళ్లతో పోలిస్తే ఈ వయసులోనే నా గురించి, నా శరీరం గురించి మరింతగా తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా నా లైంగికతను కూడా ఇప్పుడు మరింతగా అర్థం చేసుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు.
ప్రతి దశలోనూ కొత్త విషయాలు
20ల్లో తల్లిదండ్రులు వద్దన్న పనులు చేయడంపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుందని రాధికా ఆప్టే వ్యాఖ్యానించారు. 30ల్లోకి వచ్చేసరికి తల్లిదండ్రులు చెప్పిన కొన్ని విషయాలతో నిజంగానే ఏకీభవించాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తామని తెలిపారు. వయసు పెరగడం అంటే క్షీణించడం కాదని.. జీవితంలోని ప్రతి దశలోనూ మనల్ని మనం కొత్తగా తెలుసుకునే అవకాశం ఉంటుందని రాధికా ఆప్టే అభిప్రాయపడ్డారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
