- నేడు అద్భుత ఘట్టం
- బాల రాముడికి సూర్యుడి తిలకం
- సర్వాంగ సుందరంగా అయోధ్య
ఆకేరు న్యూస్, అయోధ్య : అద్భుతం.. మహాద్ధుత ఘట్టం.. నేడు అయోధ్యలో ఆవిష్కృతం కానుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉదయం 3.30గంటలకే బలరాముడికి మంగళ హారతి ఇచ్చారు. అప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు శ్రీరాముడిని దర్శించుకోవచ్చు. దాదాపు 40 లక్షల మంది నేడు బలరాముడిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు శ్రీరాముడి దర్శనం కల్పించేందుకు 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. - నేడు అద్భుత ఘట్టం : బలరాముడికి సూర్యుడి తిలకం
- ఈ ఏడాది శ్రీరామనవమి రోజు అయోధ్యలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. బాల రాముడి నుదిటి మీద శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం పడే విధంగా ఏర్పాటు చేశారు. మత విశ్వాసాల ప్రకారం చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు శ్రీరాముడి నుదుటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఏర్పాట్లు చేశారు. శ్రీరాముడికి అలంకరించే సూర్య తిలకం వేడుకను ఇంట్లో ఉండి కూడా తిలకించే విధంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. దూరదర్శన్ లో సూర్య తిలకం వేడుక ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
- ———————–
Related Stories
September 15, 2024
September 15, 2024