CPM Public Issues Appeal
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రజా సమస్యలపై అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం జనగామలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన సందర్భంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం చేయడం సరి కాదని అన్నారు.ప్రజా సమస్యలు చెప్పడానికి రాజకీయ పార్టీల నాయకుల మాటలు అధికారులు వినకుంటే మామూలు జనం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గత రెండు నెలలుగా జనగామ జిల్లా వ్యాప్తంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై నిర్వహించిన సర్వేల్లో వచ్చిన అంశాలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం కోసం సిపిఎం ప్రతినిధి బృందం వెళ్లగా కనీసం సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీలను గౌరవించకుండా కలెక్టర్ వ్యవహరించడం సరి అయిందని కాదని ఇప్పటికైనా కలెక్టర్ తన వైఖరిని మార్చుకొని ప్రజాసమస్యలు విన్నవిస్తే సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు మునిగే నరసింహులు, మంద మహేందర్, చిలుముల్ల భాస్కర్ కత్తుల రాజు, నాయకులు వంగపండ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
