Jagan Reddy Birthday Celebrations
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక, కార్యకర్తలకు ఆదర్శం చింతకుంట్ల జగన్ మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమ కారుడు చింతకుంట్ల జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు స్టేషన్ ఘన్పూర్లో ‘బీఆర్ఎస్’ నేతలు పార్సి రంగారావు, శీలం శ్యామ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ కార్య క్రమానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేయించి కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుల్లో చింతకుంట్ల జగన్ మోహన్ రెడ్డి ఒకరని కొనియాడారు. పార్టీ పట్ల నిబద్ధత, ఉద్యమం పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రతి కార్యకర్తకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శీలం శ్యామ్, పార్సి రంగా రావు ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం చేశారు. స్థానిక ప్రజలు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాన్ని అభినందించారు. పార్సి రంగారావు, శీలం శ్యామ్ మాట్లాడుతూ ఉద్యమ యోధులను గౌరవించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో జన్మదిన వేడుకలను అన్నదాన కార్యక్రమంగా నిర్వహిం చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు జనగాం యాదగిరి, కౌన్సిలర్ లు తాటికోండ మధు, బూర్ల రాజేశ్వర్, బాలగాని అనిల్, బిఆర్ ఎస్ జిల్లా యువజన నాయకులు కేసీరెడ్డి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బంగ్లా శ్రీను, మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేష్, మునిగేల మహేష్, జబ్బార్, నక్క ప్రవీణ్, సమ్మయ్య, పావని, జ్యోతి రెడ్డి, ఆకారప్ అశోక్, హిరాసింగ్, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
