Sumanth Father Suicide Attempt
* సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమం
* ప్రభుత్వంపై మనీషా ఆరోపణలు
ఆకేరు న్యూస్, వరంగల్: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం నిద్రమాత్రలు మింగిన ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై సుమంత్ భార్య డాక్టర్ మనీషా వీడియో సందేశం విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త సుమంత్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆరోపించారు.
మీడియా కథనాలు, పోలీసుల వేధింపులను తట్టుకోలేకనే తన మామ సుబ్రహ్మణ్యం ఆత్మహత్యకు ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు. తమ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తప్పుడు ప్రచారాలు, వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నం ఘటన వరంగల్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
