Gayatri Josh
Gayatri Joshi| ఆకేరు న్యూస్, ముంబై: బాలీవుడ్లో కొందరు నటీనటులు తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత సినీ రంగానికి దూరమవుతుంటారు. అలాంటి వారిలో నటి గాయత్రీ జోషి ఒకరు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన స్వదేశ్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ తర్వాత సినిమాల్లో కొనసాగకుండా వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు.
స్వదేశ్ తో గుర్తింపు
గాయత్రీ జోషి తొలుత మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. పలు ప్రకటనల్లో కనిపించిన ఆమె.. 2004లో దర్శకుడు ఆశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన స్వదేశ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన గీతాంజలి పాత్రలో నటించి మెప్పించారు. సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. గాయత్రీ మాత్రం నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నిమా రంగానికి దూరమైన అనంతరం గాయత్రీ జోషి ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చారు.
వికాస్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. వివిధ మీడియా నివేదికల్లో ఒబెరాయ్ కుటుంబం ఆయన సంపద విలువను సుమారు రూ.48,100 కోట్లుగా పేర్కొంటున్నారు. అయితే ఈ మొత్తం ఏ సంస్థ లేదా ఆస్తుల విలువ ఆధారంగా లెక్కించారనే విషయంలో నివేదికల మధ్య తేడాలు ఉండొచ్చు. ఒకే ఒక్క సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గాయత్రీ జోషి.. ఆ తర్వాత పూర్తిగా సినీ ప్రపంచానికి దూరమై కుటుంబ జీవితానికే పరిమితం కావడం అప్పట్లో అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
