Taapsee Pannu
*మథియాస్‌తో ప్రేమపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : గ్లామర్ బ్యూటీ తాప్సీ పన్ను తన వ్యక్తిగత విషయాలను కూడా చాలా బోల్డ్‌గా మాట్లాడుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో పరిచయం ఏర్పడిందని తెలిపింది.
ఆయనతో డేటింగ్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది. గతంలో ఎప్పుడూ దొరకని ఆనందాన్ని మథియాస్‌తో ఉన్నప్పుడు పొందానని, అందుకే ఆయనతో డేటింగ్ తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని పేర్కొంది.
మథియాస్‌ను ఎంచుకోవడం నా నిర్ణయమే
మథియాస్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం పూర్తిగా తన నిర్ణయమేనని తాప్సీ స్పష్టం చేసింది. అందుకు తాను గర్వపడుతున్నానని చెప్పింది. తమ బంధం 13 ఏళ్లుగా కొనసాగుతోందని తెలిపింది.
తనను సంతోషంగా ఉంచేందుకు మథియాస్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడని, అవసరమైతే త్యాగం చేయడానికి కూడా వెనుకాడడని వెల్లడించింది. తమ మధ్య ప్రేమ కంటే ముందుగా ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవం ఏర్పడిందని తాప్సీ చెప్పుకొచ్చింది.
2024లో వివాహం
దాదాపు 13 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న తాప్సీ, మథియాస్ బో 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
