ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు కోర్టుకు మెమో సమర్పించారు. ప్రభాకర్‌రావుతో పాటు మరొకరిని నిందితుడిగా పోలీసులు తేల్చారు. హార్డ్ డిస్క్ ధ్వంసంలో ప్రభాకర్ దే కీలక పాత్ర అని మెమోలో పేర్కొన్నారు. ఆయన ఆదేశాలతోనే సిబ్బంది హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసినట్లు తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదుకాగానే, ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన మెమోలో పేర్కొన్నారు.
———————————-