*సీనియర్ నటి జయవాహిని కన్నుమూత
ఆకేరు న్యూస్,డెస్క్:తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు వెండితెరపై, బుల్లితెరపై తనదైన నటనతో అలరించిన సీనియర్ నటి జయవాహిని ఇకలేరు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని మణికొండలో గల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జయవాహిని గత కొన్నాళ్లుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నప్పటికీ, ఆరోగ్యం క్షీణించడంతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ నుండి తన సొంత ఊరైన శ్రీకాకుళం జిల్లాకు తరలించారు. గురువారం రోజు ఆమె స్వస్థలంలోనే కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయవాహిని పలు సినిమాల్లోనూ, ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మరణవార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపం తెలుపుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
