Cyberabad Illegal Buildings
* 13 భవనాల కూల్చివేత
* కూల్చివేతలపై కమిషనర్ ఫోకస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అక్రమ, అనధికార నిర్మాణాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గచ్చిబౌలి అంజయ్య నగర్లో భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో అధికారులు అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తిస్తున్నారు.
తాజా తనిఖీల్లో 14 కొత్త అనధికార నిర్మాణాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే గుర్తించిన వాటిలో 13 భవనాలను పూర్తిగా కూల్చివేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో రెండు కేసుల్లో సంబంధిత యజమానులకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు.
* మూడు జోన్లలో కూల్చివేతలు
ఈ కూల్చివేతల ప్రక్రియ శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో కొనసాగింది. అత్యధికంగా కుత్బుల్లాపూర్ జోన్లో 6 అక్రమ నిర్మాణాలను తొలగించారు. కూకట్పల్లి జోన్లో 4, శేరిలింగంపల్లి జోన్లో 3 నిర్మాణాలను కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టాయి.
* నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
అనధికార నిర్మాణాలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గుర్తించిన ప్రతి నిర్మాణంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
* మూడు జోన్లలో తనిఖీలు
సీఎంసీ కమిషనర్ జి. సృజన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రత్యేక దృష్టి సారించారు. భవన నిర్మాణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. మూడు జోన్లలో తనిఖీలు, కూల్చివేతలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
