UIIC AO Recruitment 2026
* UIICలో 225 ఉద్యోగాలు..
* డిగ్రీ, పీజీ అర్హతతో అప్లై చేయొచ్చు
* ప్టెంబర్ 28 వరకు దరఖాస్తులు
* అక్టోబర్ 22న ప్రిలిమ్స్
ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా జెనరలిస్ట్, హిందీ ఆఫీసర్ విభాగాల్లో మొత్తం 225 ప్రొవిజనల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 8న ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 28 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
* 225 పోస్టులు.. రెండు విభాగాల్లో భర్తీ..
మొత్తం 225 పోస్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–జెనరలిస్ట్ విభాగంలో 200 ఖాళీలు ఉన్నాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–హిందీ ఆఫీసర్ విభాగంలో 25 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* విద్యార్హతలు ఇవే..
ఏఓ జనరలిస్ట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఇతర అభ్యర్థులు కనీసం 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించాలి. హిందీ ఆఫీసర్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీతో పాటు డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లిష్‌లో నిర్దిష్ట అర్హత ఉండాలి.
* వయోపరిమితి, ఫీజు వివరాలు..
2026 సెప్టెంబర్ 30 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
* ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. టైర్-1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 22న, టైర్-2 మెయిన్ పరీక్ష నవంబర్ 30న నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
జనరలిస్ట్ అభ్యర్థుల మెయిన్ పరీక్షలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉంటాయి. హిందీ ఆఫీసర్ పోస్టులకు కూడా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలతో పాటు సంబంధిత ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను పరీక్షిస్తారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది మెరిట్లో మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ మార్కులను 75:25 నిష్పత్తిలో పరిగణిస్తారు.
ముఖ్య గమనిక : అర్హత, పరీక్ష విధానం, దరఖాస్తు తదితర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు UIIC అధికారిక వెబ్సైట్ uiic.co.inను పరిశీలించాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
