ఇబ్బంది పడుతున్న వాహనదారులు, ప్రజలు
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : ఉప్పల్ – జమ్మికుంట రైల్వే స్టేషన్ ల మధ్య ఉన్న 14T రైల్వేగేటును ఓవర్ హాల్టింగ్ నిర్మాణ పనుల నిమిత్తం ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని కాజీపేట సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఓ ప్రకటనలో తెలిపారు. పరకాల – హుజురాబాద్ మార్గంలోని రైల్వే గేట్ కావటంతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలన్నారు. రెవెన్యూ తదితర శాఖల అధికారులు ప్రజలను, వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లేలా చైతన్యపర్చాలని రైల్వే అధికారులు కోరారు.

ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..
హుజురాబాద్ – పరకాల మార్గంలో గల ఏకైక రైల్వే గేట్ మూసివేతతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ఈ మార్గంలో వాహనదారుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ మార్గంలో నడిచే బస్సు సర్వీసులు కూడా ఉప్పల్ గేటు వరకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు కాలినడకన గేటు దాటి తర్వాత గేటు అవతలి పక్క వారి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి వాహనాల కోసం నిరీక్షించాల్సి వస్తుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
