Mahesh Babu
Mahesh Babu| ఆకేరు న్యూస్, డెస్క్ : సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల బిజినెస్‌పై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
రూ.270 కోట్ల బిజినెస్?
వారణాసి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.270 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే స్థాయిలో డీల్స్ ఖరారైతే.. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రాల్లో వారణాసి అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది.
గతంలో ఆర్ఆర్ఆర్ పుష్ప 2 వంటి భారీ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు మహేష్‌బాబు–రాజమౌళి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా వారణాసి వాటిని మించే స్థాయిలో బిజినెస్ చేసే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
దసరా తర్వాత క్లారిటీ
ప్రస్తుతం వారణాసి బిజినెస్‌కు సంబంధించి పలువురు డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే కొన్ని డీల్స్‌పై ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉందని తెలుస్తోంది. దసరా తర్వాత బిజినెస్ వ్యవహారాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
