Sreeleela
Sreeleela| సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ధర్మన్. ‘జైలర్ 2’ తర్వాత రజినీకాంత్ చేస్తున్న ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యంగ్ హీరోయిన్ రాశీఖన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాశీఖన్నా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌తో సినిమాలో హీరో రామ్ కూడా ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.
రాశీఖన్నా పోస్ట్‌తో రామ్ లీక్..
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన లీక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ధర్మన్’లో రాశీఖన్నాతో పాటు మరో హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ నేరుగా సినిమా సెట్స్ నుంచి బయటకు రావడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది.
మరోసారి కలిసి కనిపించనున్న బ్యూటీస్?
ఆసక్తికరంగా ఈ ఏడాది విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశీఖన్నా, శ్రీలీల కలిసి కనిపించారు. ఇప్పుడు మరోసారి రజినీకాంత్ సినిమాలో వీరిద్దరూ కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి ‘ధర్మన్’లో వీరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
