ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జిపి భవనం, సీసీ రోడ్లు, మహిళా భవనం నిర్మించాలని జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట, వెంకటేశ్వర పల్లి గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి వినతి పత్రం అందించారు. సోమవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఆయన నివాసంలో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. వెంకటేశ్వర పల్లిలో గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు నిర్మించాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. పల్లగుట్టలో మహిళా భవనం నిర్మించాలని కోరారు. అదేవిధంగా రెండు గ్రామాల రైతులు మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో మొక్కల కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, వెంకటాద్రి పేట మాజీ ఎంపిటిసి వెన్నకూస కుమార్ రెండు గ్రామాల రైతులు ప్రజలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
