నాగచైతన్య
* నవంబర్ 7న ఫస్ట్ సింగిల్ విడుదల!
* నాగచైతన్య ఇంటెన్స్ లుక్‌తో అనౌన్స్మెంట్ పోస్టర్
* డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి మైథలాజికల్ థ్రిల్లర్
Vrushakarma| ఆకేరు న్యూస్, సినిమా: యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజాగా చిత్రబృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి పాట ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ను నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
* ఇంటెన్స్ లుక్‌లో నాగచైతన్య
పోస్టర్లో నాగచైతన్య సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ గాగుల్స్, ఇయర్‌ఫోన్స్‌తో కనిపిస్తున్నారు. భుజంపై గాయం, డార్క్ బ్యాక్‌డ్రాప్ ఆయన లుక్కు రఫ్ అండ్ రగ్గడ్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి. అర్జున్ పాత్రలోని స్వాగ్, అటిట్యూడ్‌ను ప్రతిబింబించేలా పోస్టర్‌ను రూపొందించారు. దీంతో ఫస్ట్ సింగిల్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
* నాగచైతన్య కెరీర్లో భారీ ప్రాజెక్ట్
‘వృషకర్మ’ నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రంగా ప్రచారంలో ఉంది. అంతేకాకుండా ఆయన కెరీర్లో అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను కూడా సాధించినట్లు చిత్రబృందం పేర్కొంది. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది.
ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
* ప్రముఖ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం
ఈ చిత్రానికి రగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
నవంబర్ 7న విడుదల కానున్న ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పాటతో ‘వృషకర్మ’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం కానుంది. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

