Pawan Kalyan Niranjan Visit
* జనసేనాని పర్యటనకు సహరించిన వారికి ధన్యవాదాలు
– జనసేన రాష్ట్ర నాయకులు గాదె పృథ్వీ
అకేరు న్యూస్, హన్మకొండ : హన్మకొండ హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమై తన అభిమాన హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూడాలని కోరిన విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేనాని వెంటనే స్పందించి తానే స్వయంగా వచ్చి నిరంజన్ ను పరామర్శించారు.
నిరంజన్ కోరినట్లు కుటుంబ సభ్యులతో నలభై నిమిషాలు గడిపారు. వారికి ఉపాధి కల్పించి జీవనోపాధి కల్పించేందుకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిరంజన్ ఆరోగ్యం బాగుండాలని వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు.
పవన్ కళ్యాణ్ ను నిరంజన్ అడిగిన వెంటనే ఒక ట్యాబు, ఇష్టపడిన ఒక కుక్క పిల్ల స్థానిక జనసేన నాయకుల ద్వారా రెండు గంటల్లోనే అందించారు. అయితే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి, వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
