ఆకేరు న్యూస్, వరంగల్ : వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహించే పోలీస్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అదనపు డీసీపీ సురేష్ కుమార్ (Suresh Kumar) అన్నారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Police Commissionerate) పరిధిలో వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఒక రోజు శిక్షణ తరగతులను కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేశారు. రాష్ట్ర సెక్యూరిటీ వింగ్ ప్రధాన కార్యాలయంకు చెందిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పర్సనల్ సెక్యూరిటీ వింగ్ ఇంచార్జి డీఎస్పీ నర్సిరెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతుల్లో వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు బాంబు నిర్వీర్యం చేసే విభాగం నిర్వహించాల్సిన విధులతో పాటు పీ.ఎస్.ఓ భద్రత కల్పిస్తున్న వ్యక్తులకు శత్రువుల నుండి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సంబంధిత విభాగం అధికారులు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి వివరించారు. ఈ సందర్బంగా శత్రులకు ఎలాంటి అవకాశం కల్పించిన భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి ప్రమాదాల నివారణకై వ్యక్తి భద్రతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు. ముఖ్యంగా భద్రతా సిబ్బంది వి.ఐ.పి లకు భద్రత కల్పిస్తున్న సమయంలో అనుక్షణం పరిసరాలను పరిశీలించడంతో పాటు, వేగంగా అనుమానస్పద వ్యక్తులను గుర్తించాల్సి వుంటుందని సూచించారు. విఐపి ప్రజల మధ్య సంచరించే సమయంలో ఏ విధమైన ప్రమాదం కలుగుతుందనే దానిపై భద్రతా సిబ్బంది ముందస్తు అంచాలను వేసుకోవాలని, భద్రతా సిబ్బంది అన్ని రకాల ఆయుధాలను వినియోగించడంలో నిష్ణాతులై ఉండాలన్నారు. వీటితో పాటు దేహం దారుడ్యంగా, మానసికంగా ధృడంగా వుండాలని, ఆరోగ్య పరిరక్షణ కోసం భద్రతా సిబ్బంది నిరంతరం యోగ లేదా శారీరక వ్యాయామం చేయడం మంచిదని అదనపు డీసీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు, ఆర్.ఐలు స్పార్టాన్ రాజ్, శ్రీనివాస్, శ్రీధర్, పోలీస్ సంఘం అధ్యక్షుడు శోభన్ గౌడ్ పాల్గోన్నారు.
———–