Wardhannapet Congress NEET Protest
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా శుక్రవారం వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని మండిపడ్డారు.
ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
