* హైడ్రాపై హైకోర్టుకు కేఏ పాల్ పిటిషన్ దాఖలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 99పై స్టే విధించాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరుగగా.. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడిరచింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలుపెట్టాలని పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజులు ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. ప్రతివాదులుగా హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
