* మంత్రి పొంగులేటి
ఆకేరున్యూస్, వరంగల్ : అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారెంటీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒడిదొడుకులు ఎదురైనా పేదలను ఆదుకుంటామని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో నాలుగు పథకాలు ప్రారంభించామని.. పంటకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. భూమిలేని పేదల పరిస్థితి చూసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని వెల్లడిరచారు. ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తామని వెల్లడిరచారు. ఇల్లు లేని పేదలకు మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం. సంక్షేమ పథకాలు అందరికి అందుతాయని.. కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
