* ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
ఆకేరున్యూస్, ఆంధ్రప్రదేశ్: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ద్వారా వరద పరిస్థితులపై ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సహాయ పునరావాస కార్యక్రమాల్లో అధికారిక యంత్రాంగం నిమగ్నమైందని ఆమె తెలిపారు. ఇంత వరకు 294 గ్రామాలకు చెందిన 13,227 మంది ముంపు బాధితులను 100 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు ముంపు ప్రాంతానికి చెందిన 600 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం 5 బోట్లు , 1 హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంచామని మంత్రి అనిత స్పష్టం చేశారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
