* గుడిసెలు తొలగించేందుకు వచ్చిన వారిని కర్రలతో అడ్డగింత
ఆకేరు న్యూస్, ములుగు : తమ గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలతో తిరగబడ్డారు. తమకు కనీస సదుపాయాలు కల్పించలేని అధికారులు గుడిసెలు తొలగించేందుకు రావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన ములుగు జిల్లా (MULUGU DISTRICT) ఏటూరు నాగారం మండలం రొయ్యూరు సమీపంలోని అడవిలో జరిగింది. అటవీ ప్రాంతంలో ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు అధికారులు, ట్రాక్టర్లతో వచ్చారు. అటవీ శాఖ అధికారుల తీరుపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యూరు గ్రామానికి చెందిన కొంతమంది ఆదివాసులు సమీపంలోని పోడు భూమిలో గత ఏడాది గుడిసెలు వేసుకున్నారు. సోమవారం ఉదయం సుమారు 60 నుంచి 80 మంది అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, 20 మంది పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్లి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆదివాసులు అటవీశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి గుడిసెల కూల్చివేతను అడ్డుకున్నారు. జెసిబికి అడ్డుపడ్డారు. కర్రలతో తిరగబడ్డారు. దీంతో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
