ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ తెలంగాణ మోడల్ స్కూల్, స్టేషన్ ఘన్ పూర్ లో 2026-27 విద్యా సంవత్సరానికి 6 తరగతి నుంచి 10 తరగతి వరకు ప్రవేశాల కోసం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 19 పరీక్ష సమయం ఆరో తరగతి ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, 7-10 తరగతులకు-మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 4:00 వరకు దరఖాస్తు రుసుము ఓసీ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన విద్యార్థులు రూ.125 ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో 100 మార్కులకు ఉంటుంది హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వివరాల కోసం tgms.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. లేదా పాఠశాలలో సంప్రదించగలరనీ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణు గోపాల రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
