* ఆరు కొత్త లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఆకేరు న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కేంద్రం ఆమోదం తెలిపిన ప్రధాన లైన్లు ఇవే…కాచిగూడ – జగ్గయ్యపేట,బోధన్ – లాతూరు,గద్వాల – డొర్నకల్,వికారాబాద్ – కృష్ణా,పటాన్చెరు – ఆదిలాబాద్ 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 18 కొత్త రైల్వే లైన్లకు అనుమతులు ఇచ్చామని మంత్రి తెలిపారు. వీటి మొత్తం పొడవు సుమారు 5,665 కిలోమీటర్లు. కొన్ని చోట్ల పనులు ఆలస్యం కావడానికి భూసేకరణలో జరుగుతున్న జాప్యమే ప్రధాన కారణమని అశ్విని వైష్ణవ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి భూసేకరణ ప్రక్రియ వేగవంతమైతే, నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
