Rah Veer golden hour
* రహ్-వీర్ గా మారి ప్రాణాలను కాపాడండి
* జాతీయ స్థాయి పురస్కారం క్రింద రూ.1 లక్ష
* హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరుడిగా మారి, రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి రహ్-వీర్ గుర్తింపు పొందాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను ప్రమాదం జరిగిన మొదటి గంట (GOLDEN HOUR) లోపు ఆస్పత్రిలో చేర్చి బాధితుల ప్రాణాలు కాపాడి సహాయం చేసే వారిని గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం రహ్-వీర్ పథకాన్ని ప్రవేశపెట్టిందని సజ్జనర్ తెలిపారు. ఈ పథకం ద్వారా బాధితుల ప్రాణాలు కాపాడిన వారికి రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని ప్రభుత్వం అందజేస్తుందని, సంవత్సరంలో ఐదు సార్లు నగదు బహుమతి అందుకోవచ్చని సజ్జనర్ అన్నారు. జాతీయ స్థాయిలో విశిష్ట సేవలు అందించిన ఎంపికైన వారికి రూ.1,00,000 నగదు పురస్కారం లభిస్తుందని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్చినప్పుడు, చేర్చిన వారి పేరు,వివరాలను తీసుకొని వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు రికమెండ్ చేయడం ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్ ఈ పురస్కారాన్ని అందజేస్తారని అన్నారు.
చాలామంది పోలీసు కేసు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనీ ,భయంతో వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ 2019 లో సవరణ చేసి 134ఏ క్లాస్ ప్రకారం ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదని, వ్యక్తిగతంగా అనుమతితో మాత్రమే సాక్ష్యం తీసుకోవడం జరుగుతుందని సజ్జనర్ స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే వీడియోలు తీస్తూ సమయాన్ని వృథా చేయకుండా, గోల్డెన్ అవర్‌లో స్పందించి బాధితులను ఆదుకోవడమే నిజమైన వీరత్వం అని సజ్జనర్ అన్నారు. మనమందరం కలిసి రహదారి పై మరణాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మారి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి రహ్-వీర్ గా గుర్తింపు పొందుదామని సామాజిక వేదిక ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేస్తారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
