Dammannapet farmer attack incident
* పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారు దొడ్లగడ్డలో దారుణం చోటు చేసుకున్నది. నాయం రవిందర్ రెడ్డి ( 45 ) అనే రైతు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా గొంతుకోసారు. గ్రామంలో ఉన్న రవిందర్ రెడ్డి ని అడ్డగించి ఒక్కసారిగా గొడ్డళ్ళతో దాడి చేయడంతో పాటు, గొంతు కోసారని గ్రామస్తులు అంటున్నారు. స్థానికంగా ఉన్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఒక్కసారిగా ఆగంతకులు పరుగులు తీశారంటున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్ రవిందర్ రెడ్డిని కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. నేరస్తుల కోసం వర్ధన్నపేట పోలీసులు గాలిస్తున్నారు.. కాగా భూ తగాదాలే కారణం అయి ఉంటాయని గ్రామస్తులు అంటున్నారు.

——–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
