Yashaswini Kalyana Lakshmi Scheme
ఆకేరు న్యూస్ రాయపర్తి:- పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రధాన ఉద్దేశ మని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు 25 లక్షల 2 వేల 900 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ముఖ్యంగా మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
