Pulse Polio Awareness Program
* పోలియో రహిత సమాజం కావాలి
.. కమిషనర్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వాణిశ్రీ, మున్సిపాలిటీ కమిషనర్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో నివారణ కోసం ప్రభుత్వం అందిస్తున్న చుక్కల మందు ఐదేళ్ల లోపు పిల్లలకు వేయించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
* తాటికొండలో డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గ్రామ సర్పంచ్ మారపాక సుజన శ్రీనివాస్ ప్రారంభించారు. ఉప సర్పంచ్ కట్టమల్లు, వార్డు సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. *ఇప్పగూడెంలో డాక్టర్ ప్రణీత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మందపురం రాణి అనిల్ ప్రారంభించారు. వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
* చిల్పూర్ మండలం మల్కాపూర్ సర్పంచ్ ఎడవెళ్లి లావణ్య మల్లారెడ్డి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పశుల వెంకటేశ్వర్లు, వార్డ్ సభ్యులు గజ్జెల్లి కుమారస్వామి, ఉద్దేమరి హరీష్, భోగం షర్మిల, ఏన్ఎమ్ సబిత, ఆషాలు రజిత, స్వరూప ,శ్రీనివాస్, కార్తిక్, లింగం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
