Peddi Sudarshan Reddy Health
అకేరు న్యూస్, వరంగల్: గ్రీన్ ఛానెల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పై కేసిఆర్ ఆరా
వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేసీఆర్ ఆదేశం
అస్వస్థతకు గురైన విషయం తెలిసి, ఆందోళన చెంది ఉదయం నుంచి పెద్ది ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్న కేసీఆర్
సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వినోద్ మరియు జిల్లా నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్న కేసీఆర్
గుండె సంబంధిత అత్యవసర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక అంబులెన్స్ లో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు
ప్రస్తుతం ఆయన ఆసుపత్రికి చేరుకోగా, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు
అతిత్వరలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి నుంచి అధికారిక హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది
Please tell us what is wrong. Your report will be sent to the website team.
