Hydraa Revanth Reddy Statement
* కబ్జా కోరులే హైడ్రాను అడ్డుకోవడానికి చూస్తున్నారు.
* న్యాయ స్థానం తీర్పు సమీక్షిస్తాం
* పేదల ఆస్తులు కాదు, పెద్దల ఆస్తులే కొట్టేశాం
– ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, డెస్క్ : హైడ్రాను ఆపేది లేదు.. రంగనాథ్‌ను పంపేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సీఎం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా హైడ్రా గురించి మాట్లాడుతూ చెరువులను, కుంటలను, నాలాలను కాపాడేందుకే ఏర్పాటు చేశాం.. పేదల ఆస్తులు కాదు, పెద్దలవే హైడ్రా కొట్టేసింది.. ఎన్ కన్వెన్షన్ ఏమైనా పేదలదా అని ప్రశ్నించారు. భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను, పార్కులను చెరువులను కబ్జా పెట్టినవాళ్ళే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టు ధిక్కరణ అంటున్నారు.. అధికారులను మార్చడం – కొనసాగించడం ప్రభుత్వం యొక్క విచక్షణాధికారాలకు సంబందించిన అంశం. ఈ అధికారాలను ఎవరూ కూడా గుంజుకోలేరన్నారు.. తద్వారా హైడ్రా కమిషనర్‌ను ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదన్న సంకేతం ఇస్తూనే , న్యాయ స్థానం ఆదేశాలను తప్పని సరిగా పాటిస్తామన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన సోమేశ్ కుమార్ అనే ఐఏయస్ అధికారి పైన ఏకంగా 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయి.. అప్పుడెవరూ మాట్లాడలేదు.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.. న్యాయ స్థానాల మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.. తప్పుడు కేసులను న్యాయస్థానాల ద్వారానే ఎదుర్కొంటాం.. హైడ్రా అనేది మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అత్యుత్తమ సంస్కరణ. జాతీయ స్థాయిలో అభినందనలు, ప్రశంసలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డ్ అన్నారు. బతుకమ్మ కుంటను కూడా బీఆర్ ఎస్ నాయకులు కబ్జా చేశారు. దాని పేరే బతుకమ్మ కుంట..దాని మీద కూడా కోర్టు ధిక్కరణ కేసు ఉంది.. వందల ఎకరాలు కబ్జా చేసిన మరో వ్యక్తి కూడా కోర్టు ధిక్కరణ కేసు కు వెళ్ళాడు.. ఇలాంటివన్ని ఎలా చూడాలంటారు.. కేసీఆర్ కు విమానంలో నుంచి పూల వర్షం కురిపించారు సుధాకర్ రెడ్డి అనే ఒక టీఆర్ ఎస్ నాయకుడు.. బతుకమ్మ కుంటలో పదెకరాలు ఆక్రమించుకుంటే పూల వర్షం ఏంటి కనక వర్షమే కురిపించవచ్చని ఏద్దేవా చేశారు..
=================================
Please tell us what is wrong. Your report will be sent to the website team.
