mulugu rain alert
* భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
-ములుగు డిఎస్పీ రవిందర్
ఆకేరు న్యూస్, ములుగు:
భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు లోతట్టు ప్రాంతాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నదని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ములుగు డిఎస్పీ రవిందర్ సూచించారు.బుధవారం మేడారం జంపన్న వాగు పరివాహక ప్రాంతాల్లో మేడారం ఎస్ ఐ కమలాకర్ తో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కాలువలు రహదారులపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించ రాదనికోరారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను వరద నీటి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,రైతులు, పశువుల కాపరులు వర్షంతో పిడుగులు పడుతున్న సమయంలో చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
వాహనదారులు భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో,రాత్రి వేళల్లో, అప్రమత్తంగా ప్రయాణించాలని,ఎక్కడైనా రహదారులు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం, వరద నీరు చేరడం రహదారులపై నీరు ప్రవహించడం వంటి పరిస్థితులు ఎదురైతే, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ వారికి పూర్తి సహకారం అందించాలని వాహనదారులకు సూచించారు.
ములుగు జిల్లా పోలీసు సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండి, పెట్రోలింగ్ నిర్వహిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని,ప్రజలందరూ పోలీసు శాఖ ఇతర ప్రభుత్వ శాఖలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటిస్తూ తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతకు సహకరించాలని డిఎస్పీ కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
