Kaleshwaram Fish Rains Incident
Published:
Updated: 30 Jul 2026 • 03:42 PM
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నడుమ ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపల వర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు. పల్లె ప్రకృతి వనం, మజీద్ పల్లితో పాటు పలు ప్రాంతాల్లో నేలపై, రోడ్లపై చేపలు దర్శనమిచ్చాయి.
ఈ చేపలకు బలమైన ముళ్లు ఉండడమే కాకుండా, నేలపై పాకుతూ ముందుకు వెళ్తుండటం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఈ వింత దృశ్యాలను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గతంలోనూ ఇక్కడ ఇలాగే రెండుసార్లు చేపల వర్షం కురిసిందని స్థానికులు గుర్తుచేస్తున్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
