CM Revanth Reddy Delhi Meeting
* కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో కీలక సమావేశం
ఆకేరు న్యూస్, డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక భేటీల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందంతో కలిసి సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో నిర్మాణాలు జరుపుకుంటున్న పలు కీలక ప్రాజెక్టులు, విస్తరణ దశలో ఉన్న రహదారులకు సంబంధించిన శాఖాపరమైన అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు.
* ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
రాష్ట్రంలో రవాణా రంగానికి, తాగు మరియు సాగునీటి సరఫరాకు ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు (Environmental Clearances) వేగవంతంగా జారీ చేయాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కోరారు.
ముఖ్యంగా అనుమతులు పెండింగ్‌లో ఉన్న క్రింది ప్రాజెక్టుల వివరాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు-రంగారెడ్డి, ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, ఎస్ ఆర్ వి ఆర్ డిండి (S.R.V.R. Dindi) ప్రాజెక్టు, గౌరవెల్లి ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్టులతో పాటు పలు జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణకు కావలసిన అటవీ శాఖ అనుమతులను క్లియర్ చేయాలని వినతిపత్రం సమర్పించారు.
* రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విన్నపం…
అనుమతుల లేమి వల్ల పనులు ఆలస్యమై ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుతోందని, ఫలితంగా ప్రజలకు లబ్ధి చేకూరడంలో జాప్యం జరుగుతోందని సీఎం వివరించారు. రాష్ట్ర నీటిపారుదల రంగాన్ని పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా వెంటనే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వినతులపై పరిశీలన జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ హామీ ఇచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
