HYDRA Commissioner Raganath Fake NOC Scam
* ఫైర్ నకిలీ ఎన్ఓసీల సృష్టి
* ఏకంగా ఇంటర్‌బోర్డుకు సబ్మిట్
* 8 ప్రైవేట్ కాలేజీల లీల
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు కాలేజీలు ఏకంగా ఐపీఎస్ అధికారి సంతకాన్నేఫోర్జరీ చేశాయి. కళాశాలల నిర్మాణానికి ఇంటర్ బోర్డు అనుమతి కోసం ఫైర్ నకిలీ ఎన్ఓసీలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడ్డాయి. ఈ ఘటనపై అధికారులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నాయి. ఆ కళాశాలల గుర్తింపు రద్దుకు ఆలోచిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని 8 ప్రైవేటు కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరుతో ఫైర్ నకిలీ ఎన్ఓసీ (NOC)లు సృష్టించాయి. వాటిని ఇంటర్ బోర్డుకు కూడా సబ్మిట్ చేశాయి. అనుమానంతో ఆరా తీస్తే విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఎన్ఓసీలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయా కాలేజీలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 8 కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
* బయటపడింది ఇలా..
ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఇంటర్మీడిట్ బోర్డుకు ప్రైవేటు కళాశాలలు సమర్పించిన ఎన్ ఓసీలను హైడ్రా పరిశీలించింది. మొత్తం 76 కాలేజీలు ఇంటర్మీడిట్ బోర్డుకు ఎన్ఓసీ లు సమర్పించాయి. తాము అన్నింటికీ ఎన్ఓసీ జారీ చేయలేదని, పరిశీలించగా 8 కాలేజీలు ఫేక్ ఎన్ఓసీలు సమర్పించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో ఆయా కాలేజీల గుర్తింపురద్దును పరిశీలించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* ఆ కళాశాలలు ఏంటంటే..
1. హైందవ జూనియర్ కాలేజీ, బర్కత్‌పుర.
2. రెసోనెన్స్ జూనియర్ కాలేజీ, ఎస్ ఆర్‌నగర్.
3. ప్రియాంక జూయర్ కాలేజీ, మెహిదీపట్నం.
4. మదర్స్ గాళ్స్ జూనియర్ కాలేజీ, విద్యానగర్.
5. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ, చాంద్రాయణగుట్ట.
6. న్యూ ఎరా జూనియర్ కాలేజీ, చిక్కడపల్లి.
7. షాహిన్ జూనియర్ కాలేజీ, శివరాంపల్లి.
8. వశిష్ట జూనియర్ కాలేజీ, తెల్లాపూర్.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
