Meta CEO Mark Zuckerberg Apology To PM Modi
ఆకేరు న్యూస్, డెస్క్: భారత పార్లమెంటరీ కమిటీ జారీ చేసిన తీవ్ర హెచ్చరికలతో సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ దిగివచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన జులై 23 నాటి వీడియోను తమ ప్లాట్‌ఫామ్ నుంచి హఠాత్తుగా తొలగించడంపై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా క్షమాపణలు తెలిపారు. ఈ వ్యవహారంలో పార్లమెంటరీ కమిటీ విధించిన మూడు రోజుల అల్టిమేటం ముగియకముందే మెటా సంస్థ స్పందించడం గమనార్హం.
* ప్లాట్‌ఫామ్ నిర్వహణ లోపాలపై విచారం…
తన సందేశంలో జుకర్‌బర్గ్ ప్రధానంగా సాంకేతిక లోపాలు, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లను అంగీకరించారు. ప్రధాని వీడియో అందుబాటులో లేకుండా పోవడంపై విచారం వ్యక్తం చేస్తూనే, బాలల లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM) మరియు డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తికి సంబంధించి చోటుచేసుకున్న లోపాలపై భారత్‌కు క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో హానికరమైన కంటెంట్‌ను అరికట్టేందుకు, అల్గోరిథంలను నియంత్రించేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
* పార్లమెంటరీ కమిటీ కఠిన వైఖరి…
జూలై 23న ప్రధాని మోదీ వీడియోను దాదాపు 5 గంటల పాటు తొలగించడంపై ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదని స్పష్టం చేసిన కమిటీ.. బాధ్యులపై చర్యలతో పాటు బహిరంగ క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ స్పందించకపోతే ఐటీ చట్టం సెక్షన్ 79 ప్రకారం మెటాకు లభించే ‘సేఫ్ హార్బర్’ న్యాయ రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది.
* భద్రతపై కొత్త హామీలు…
కమిటీ హెచ్చరికల నేపథ్యంలో స్పందించిన మెటా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పారదర్శకత పెంచుతామని తెలిపింది. ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన సమాచారం బూస్ట్ కాకుండా కట్టడి చేస్తామని పేర్కొంది. దేశంలో సామాజిక మాధ్యమాల బాధ్యతాయుత ప్రవర్తనపై ఈ పరిణామం ఒక పెద్ద మార్పుగా నిలవనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
