Medical Student Priyanka Dies After Suffering Critical Injuries in Car Accident
* రాజమండ్రి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి
అకేరు న్యూస్, డెస్క్ : రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి చెందింది. గత కొద్ది రోజులుగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన ఆమె.. ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు తుదిశ్వాస విడిచింది.
ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్యా మాల్ సమీపంలో ప్రియాంకపై కారు ఎక్కించి ప్రమాదానికి గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో దుష్యంత్, ఆండ్రూ అనే యువకులపై ఆరోపణలు ఉన్నాయి.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను తొలుత స్థానికంగా చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ప్రియాంక మృతి చెందింది.
ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
