Thorrur Tahsildar Srinivas
* డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ చేతుల మీదుగా పురస్కారం అందజేత
ఆకేరు న్యూస్,తొర్రూర్ :
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల తహసీల్దార్ గడీల శ్రీనివాస్ ‘ఉత్తమ ఉద్యోగి’ అవార్డును అందుకున్నారు. ప్రజలకు అందించిన విశిష్ట సేవలు, రెవెన్యూ శాఖలో చూపిన ప్రతిభను గుర్తించి జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్, స్నేహ శబరీష్ ల సమక్షంలో ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ చేతుల మీదుగా తహసీల్దార్ శ్రీనివాస్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును, ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఈ అవార్డుకు ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ గారికి మరియు అవార్డు అందించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో ప్రజలకు, రైతులకు మరిన్ని సేవలు అందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి వేగంగా తీసుకెళ్లేందుకు శ్రమిస్తానని స్పష్టం చేశారు.
తహసీల్దార్ శ్రీనివాస్‌కు ‘ఉత్తమ ఉద్యోగి’ అవార్డు రావడం పట్ల తొర్రూరు మండల రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
