Pralay Ranveer Kalyani Priyadarshan
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తన తదుపరి చిత్రం ‘ప్రళయ్’ షూటింగ్‌ను ప్రారంభించారు. ఆదివారం ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రపంచ అంతానికి దారితీసే విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
* షూట్ లో నటి కళ్యాణి ఎంట్రీ
ముంబైలో భారీ సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రాణాలను కాపాడుకునేందుకు చేసే పోరాటమే కథకు ప్రధానాంశంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మలయాళ చిత్రం‘లోకా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. వీరిద్దరూ తొలిసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
* నిజమైన లొకేషన్లలో షూట్
‘ప్రళయ్’కు జై మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లోని నిజమైన లొకేషన్లలో చిత్రీకరణ చేపట్టనున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం చిత్రబృందం ఇప్పటికే పలు నెలలుగా సాంకేతిక ప్రీ-ప్రొడక్షన్ పనులు నిర్వహించినట్లు సమాచారం. థియేటర్లను లక్ష్యంగా చేసుకుని సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్స్
ఇక రణ్వీర్ సింగ్ ఇటీవల ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి

Please tell us what is wrong. Your report will be sent to the website team.
