NDA CDS Exams 2026
* పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
ఆకేరు న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ (NDA & NA)-2, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షా కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, కేంద్ర పరిశీలకుడు ఉమేష్ కుమార్ మీనా శనివారం పరిశీలించారు.
హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగళి బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలను వారు సందర్శించారు. పరీక్షా గదులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా జరిగేలా అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, అదనపు తహసీల్దార్లు రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
