Raviteja Irumudi
* ఈ సినిమాతో నా గౌరవం పెరిగింది: రవితేజ
* ఇరుముడి సక్సెస్ క్రెడిట్ శివ నిర్వాణకే
ఆకేరు న్యూస్, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్రబృందం బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ఇరుముడి తనకు ఎంతో తృప్తినిచ్చిన సినిమా అని అన్నారు. ఈ సినిమాతో తనపై ప్రేక్షకుల్లో గౌరవం మరింత పెరిగిందని, యాక్టర్‌గా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పారు.
“ఈ సినిమాతో నాకు ఇంత రెస్పెక్ట్ వచ్చింది అంటే ఆ క్రెడిట్ మొత్తం శివ నిర్వాణకే. శివ ఎన్నో రాత్రులు కష్టపడి మాకు సూపర్ సక్సెస్ ఇచ్చారు. సెట్స్‌లో అందరం ఎంతో సరదాగా ఎంజాయ్ చేశాం. ప్రేక్షకులు ఒక్కో సీన్ గురించి ఫోన్లు చేసి తమ రియాక్షన్స్ చెబుతుంటే నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి” అని రవితేజ తెలిపారు.
ఇరుముడి అంటే శివ.. శివ అంటే శివ నిర్వాణ అని రవితేజ ప్రశంసించారు. సినిమాలో నటించిన అజయ్ ఘోష్, సాయి, ప్రియా భవాని శంకర్‌తో పాటు ప్రతి ఒక్కరి నటనను ఆయన అభినందించారు. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మాట్లాడుతూ.. ఇరుముడికి సంగీతం అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. శివ నిర్వాణ కథను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో అనంత శ్రీరామ్, హీరోయిన్ ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, నిర్మాత నవీన్, దర్శకుడు శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
