Idupu Kayitham Srilatha Song
* డిసెంబర్లో థియేటర్లలోకి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హీరో ప్రియదర్శి నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత..’ పాట విడుదలైంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో ఎంటర్టైనింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు.
* ఆకట్టుకుంటున్న జంట కెమిస్ట్రీ
‘శ్రీలత..’ పాటలో ప్రియదర్శి, నాగదుర్గ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటకు అలరాజు సాహిత్యం అందించారు. శంకర్ బాబు, మోహన భోగరాజు ఆలపించారు. అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాటలో పిల్లలతో రూపొందించిన డ్యాన్స్ సీక్వెన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెలోడీగా సాగుతున్న పాటకు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.
* డిసెంబర్లో థియేటర్లలోకి
‘ఇడుపు కాయితం’ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాను డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
