Free Bus Seat Fight
* జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు
* వైరల్గా మారిన వీడియో..
ఆకేరు న్యూస్, పరిగి : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు, గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది.
* పరిగి-హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఘటన.
బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య మొదట మాటామాటా పెరిగినట్లు తెలుస్తోంది. అనంతరం వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జుట్టు పట్టుకుని కొట్టుకోవడంతో బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గొడవను ఆపేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించినప్పటికీ కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీసినట్లు సమాచారం.
* సోషల్ మీడియాలో చక్కర్లు..
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా బస్సుల్లో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సీట్ల కోసం ఇలాంటి గొడవలు చోటుచేసుకోవడం చర్చకు దారితీస్తోంది. ప్రయాణికులు సంయమనం పాటించాలని, సీట్ల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
