District Collector Hemanth Sahadevarao.
* అక్టోబర్ 4న పోలింగ్..
* సెప్టెంబర్ 24న నామినేషన్లు
Red Cross Elections: ఆకేరు న్యూస్, ములుగు: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ఆదేశాల మేరకు ములుగు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను అక్టోబర్ 4న నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, నిర్ణీత కాలపట్టిక ప్రకారం నిర్వహించాలని సూచించారు.
అర్హులైన సభ్యులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఓటర్ల జాబితా పరిశీలన, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
సెప్టెంబర్ 24న నామినేషన్లు
ఎన్నికల అధికారిగా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ధర్మ నాయక్‌ను, ఎన్నికల పరిశీలకుడిగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం. సంపత్‌రావును నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.
సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితాతోపాటు ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు. సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒక్కో నామినేషన్‌కు తిరిగి చెల్లించని డిపాజిట్‌గా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం అదే రోజు జిల్లా శాఖ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడి ఎన్నికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
