Revanth Reddy
* రేపటి అసెంబ్లీ వ్యూహంపై మంత్రులతో చర్చ
Revanth Reddy: ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని MCRHRDలో సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. రేపు అసెంబ్లీలో 22ఏ అంశంపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
22ఏపైనే చర్చ
22ఏ నిషేధిత భూముల జాబితా, భూముల వర్గీకరణ, గతంలో చోటుచేసుకున్న పరిణామాలు తదితర అంశాలపై అసెంబ్లీలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా ప్రస్తావించే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వివరించేందుకు అవసరమైన అంశాలపై సీఎం మంత్రులతో చర్చించినట్లు సమాచారం.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే 22ఏ భూముల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తన హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీ వ్యూహంపై ఫోకస్
అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రేపు సభలో అనుసరించాల్సిన వ్యూహంపైనా సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. 22ఏతో పాటు ఇతర అంశాలపై ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలు, విమర్శలకు ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా సమాధానం ఇవ్వడం, సభలో ప్రభుత్వ వాదనను బలంగా వినిపించడంపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో 22ఏ భూముల అంశంపై రేపటి అసెంబ్లీ చర్చపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
