Modi Birthday
* ప్రధాని జన్మదిన వేడుకల్లో బీజేపీ శ్రేణుల సందడి
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ ,ఉప్పల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి ఆశీర్వాద దీపాలతో ఘనంగా నిర్వహించారు. కమలాపూర్ రామాలయం వద్ద ప్రధాని మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పేరు వచ్చే విధంగా 75 దీపాలతో ప్రత్యేకంగా ఆశీర్వాద దీపాలను వెలిగించారు.
ఈ కార్యక్రమంలో కమలాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్, మండల బీజేపీ అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, బండి కళాధర్, శనిగరం సర్పంచ్ రాజు, గుండేటి సర్పంచ్ రవి, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు, పలువురు బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఉప్పల్ గ్రామంలోనూ ప్రధాని మోడీ జన్మదిన వేడుకలను అత్యంత కోలాహలంగా జరుపుకున్నారు. గ్రామంలో బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
