Dulquer Salmaan
Dulquer Salmaan| ఆకేరు న్యూస్, హైదరాబాద్: సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పేరుతో కొనసాగుతున్న ఓ పారడీ అకౌంట్‌పై ఆయన స్పందించారు. ఆ ఖాతా తన పేరుతో సినిమాలు, ఇతర నటీనటులు, కుటుంబ సభ్యుల గురించి కూడా పోస్టులు చేస్తోందని దుల్కర్ తెలిపారు.
నమ్మొద్దంటూ హెచ్చరిక
ఎక్స్ వేదికగా స్పందించిన దుల్కర్ సల్మాన్.. @_dulQuer తన అధికారిక ఖాతా కాదని స్పష్టం చేశారు. ఆ అకౌంట్‌ను తన నిజమైన ఖాతాగా భావించవద్దని అభిమానులను కోరారు. పారడీ అకౌంట్ అని పేర్కొంటూనే తన పేరుతో వివిధ అంశాలపై వ్యాఖ్యలు చేస్తోందని తెలిపారు.
అధికారికంగా ఫిర్యాదు
తన సినిమాలు, ఇతర నటీనటుల గురించి పోస్టులు చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా తప్పుడు శుభాకాంక్షలు చెబుతోందని దుల్కర్ పేర్కొన్నారు. దీనివల్ల అనవసరమైన గందరగోళం, ప్రతికూలత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఖాతాపై ఇప్పటికే రిపోర్ట్ చేయడంతో పాటు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఎక్స్ నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉందని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
