Allari Naresh Alcohol Movie release date announcement
* డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల!
* సరికొత్త లుక్‌లో కనిపించనున్న అల్లరి నరేష్
ఆకేరు న్యూస్, సినిమా: విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లరి నరేష్ మరో ఆసక్తికరమైన సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్కహాల్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
* క్రైమ్, మానవ ప్రవర్తన నేపథ్యంలో కథ
మెహర్ తేజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనుషులు తీసుకునే నిర్ణయాలు, వాటి పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ గత చిత్రాలకు భిన్నంగా స్టైలిష్, సరికొత్త లుక్‌లో కనిపించడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన రుహానీ శర్మ కథానాయికగా నటిస్తున్నారు. నిహారిక ఎన్ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి దమరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
* ప్రతిభావంతమైన సాంకేతిక బృందం
‘ఆల్కహాల్’ చిత్రానికి ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ చేస్తున్నారు. విశాల్ అబాని ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
విభిన్నమైన కథాంశం, అల్లరి నరేష్ సరికొత్త అవతారం, ఆసక్తికరమైన నటీనటుల కలయికతో రూపొందుతున్న ‘ఆల్కహాల్’ డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.+

Please tell us what is wrong. Your report will be sent to the website team.

