తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి విలువైన చెక్కును అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
* వరద బాధితులకు రూ.కోటి అందజేత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(TELANGANA CHIIF MINISTER REVANTHREDDY)ని.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (AP DEPUTY CM PAVANKALYAN)కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి చేరుకున్న పవన్.. ఆయనకు తన వంతు సాయంగా రూ. కోటి చెక్కును అందజేశారు. దీనిపై పవన్ కల్యాణ్‌కు.. సీఎం రేవంత్(CM REVANTH) ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం సంభవించింది. ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా నిలుస్తూ పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. పవన్ కల్యాణ్ కూడా తన వంతుగా తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.కోటి ప్రకటించారు.
————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
