* కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి
* ఓయూ వైస్ ఛాన్సలర్‌గా కుమార్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించింది. వీసీల నియమాకంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా.. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీగా వీసీగా కుమార్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యనందరావు, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీగా అల్దాస్ జానయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ రాజిరెడ్డి నియామకం అయ్యారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
